Friday, November 22, 2024
HomeతెలంగాణDK Aruna | కుల గణనపై డీకే అరుణ సూటి ప్రశ్నలు

DK Aruna | కుల గణనపై డీకే అరుణ సూటి ప్రశ్నలు

రాష్ట్రంలో కుల గణనపై ఎంపీ డీకే అరుణ (DK Aruna) ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేశారు. గురువారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న కులగణలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధమైన ప్రశ్నావళి ఉందన్నారు. ప్రజల ఆస్తులు, అప్పులు, భూములు, వ్యక్తిగత వివరాలు ఎందుకో చెప్పాలన్నారు. ఎవరు ఏ రాజకీయ పార్టీలో అనే వివరాలు‌ మీకు ఏం అవసరం అని ప్రశ్నించారు. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు..? అసలు ఈ సర్వే దేని కోసమో స్పష్టం చేయాలి అని డీకే అరుణ (DK Aruna) డిమాండ్ చేశారు.

- Advertisement -

డీకే అరుణ ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే…

  • బీసీలను, ప్రజలను మోసం చేయడానికే ఈ సమగ్ర సర్వే
  • చిత్తశుద్దు ఉంటే గతంలో కేసీఆర్ చేసిన‌ సర్వె రిపోర్ట్ ను బయట పెట్టండి
  • ప్రజల పర్సనల్ వివరాలు‌మీకు ఎందుకో చెప్పాలి
  • ఎకనామికల్ సర్వే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది‌ కదా
  • మీరు చెప్పిన ప్రతి‌పథకాన్ని సర్వే ద్వారా అమలు చేస్తాం అంటున్నారు
  • బీసీ వర్గాలను మోసం చెయడానికే ఈ సర్వే
  • ఇచ్చినహామీల అమలుపై దృష్టి మరల్చేందుకే కుటుంబ సర్వే
  • మరోసారి మోసం చేసేందుకే బీసీ జెండా ఎజెండాతో వచ్చారా..?
  • ఇప్పటికే కాంగ్రెస్ చేసన ఆరు గ్యారంటీల మోసాలని ప్రజలు గుర్తించారు
  • ప్రస్తుత కుటుంబ సర్వేలో‌ క్వశ్చనీర్ సరిగా లేదు
  • ఈ కులగణనలో ఈ ప్రశ్నలన్నీ ఎందుకో అర్థం కాలేదు
  • ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే కుటుంబ సర్వే డ్రామాలు
  • ప్రజలను బలవంతపెట్టి వివరాలు సేకరించొద్దు

వీటి సంగతేంటి..?

  • రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు
  • కల్యాణలక్ష్మీ తులం బంగారం ఎక్కడ
  • ఇందిరమ్మ కమిటీలు అని వేసి పీఎం ఆవాస్ యోజన‌ఇండ్లను ఇందులో ఎందుకు కలిపారు
  • ఆరోగ్య శ్రీ‌కింద ఎక్కడెక్కడ 10 లక్షల‌మందికి ట్రీట్మెంట్ ఇచ్చారో చెప్పాలి

మేము వ్యతిరేకం కాదు

  • కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోస్తే.. వీళ్లు మూసీ ప్రక్షాళన అంటున్నారు
  • మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు
  • మూసీ సుందరీకరణ పేరుతో దోచుకోవాలని చూస్తే సహించేదిలేదు
  • వాళ్లు అంత తిన్నారు.. మేము ఇంత తింటామంటే చూస్తూ ఊరుకోము
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News