Thursday, April 3, 2025
HomeతెలంగాణMalla Reddy | మల్లారెడ్డికి మరోసారి షాకిచ్చిన ఈడీ

Malla Reddy | మల్లారెడ్డికి మరోసారి షాకిచ్చిన ఈడీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Chamakura Malla Reddy)కి ఈడీ అధికారులు మరోసారి షాకిచ్చారు. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఆయనకి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది జూన్ లో మల్లారెడ్డికి సంబంధిన కాలేజీలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 కాలేజీల్లో రైడ్స్ జరిపిన అధికారులు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Also Read: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. అధికారుల మధ్య వార్

తాజాగా మరోసారి మల్లారెడ్డి (Malla Reddy)కి ఈడీ నోటీసులు అందడం హాట్ టాపిక్ గా మారింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 సీట్లు బ్లాక్ చేసి అక్రమంగా అమ్ముకున్నట్టు ఈడీ గుర్తించినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News