రంగారెడ్డి జిల్లాలోని భూదాన్ భూముల(Bhudan Lands) కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(Marri Janardhan Reddy)కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు వంశీరాం బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డితో పాటు సూర్యతేజ, సిద్ధారెడ్డికి కూడా నోటీసులు అందజేశారు. ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కాగా భూదాన్ భూములను తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(IAS Amoy Kumar)ను ఇటీవల ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ..అమోయ్ కుమార్‌పై కేసు నమోదుకు సిఫారసు చేస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender)కు ఈ నివేదికను సమర్పించింది.