America| అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. చికాగోలో జరిగిన దుండగు కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ(22) మూడు నెలల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వచ్చాడు. ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు.
- Advertisement -
అయితే శనివారం ఉదయం కొంతమంది దుండగులు మాల్‌లోకి ప్రవేశించి సాయితేజపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో అతడు స్పాట్‌లోనే మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.