గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో దీక్ష విరమింపచేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్:
గద్వాల గొంతు తడపడానికి జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి, ఇతర నేతలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని, వేసవిలో నీటి కష్టాలు వస్తాయని ప్రజలందరి కోసం ఈ దీక్ష చేపట్టారన్నారు. అన్ని వర్గాల ప్రజలు దీక్షకు వచ్చి మద్దతు పలికారని, కర్నాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. రేవంత్ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీలు తీసుకురావొచ్చు కదా? అంటూ హరీష్ మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో మంచినీళ్ల కోసం ఒక్క ఎమ్మెల్యే అన్నా దీక్ష చేసిండా? మహిళలు రోడ్డపైకి వచ్చిండ్రా? అంటూ ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ హరీష్ రావు కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.