Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: సర్వతోముఖాభివృద్ధికి సర్పంచ్ కృషి

Garla: సర్వతోముఖాభివృద్ధికి సర్పంచ్ కృషి

10 ఏళ్ల కాలంలో మేజర్ గ్రామ పంచాయతీ..

గార్ల మెజర్ గ్రామ పంచాయతీ సర్వతో ముఖాభివృద్ధికి సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ ఎనలేని కృషి చేశారని జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేసి గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి పరచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అన్ని విధాలుగా సదుపాయాలను సమకూర్చినట్లు ఆయన పంచాయతీకి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు పాలకవర్గం సభ్యులు పుర ప్రముఖులు సర్పంచ్ బన్సీలాల్ దంపతులను శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ ఎస్ఐ జీనత్ కుమార్ వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ ఎంపీటీసీ రమేష్ కార్యదర్శి కుమార స్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి సక్రు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ పల్లా నరసయ్య గంధసిరి వీరన్న జితేందర్ అగర్వాల్ వార్డు మెంబర్లు తోడేటి శ్రీనివాస్ అజ్మీరా సుమలత గ్రామపంచాయతీ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News