శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని గార్ల సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో పార్టీల నాయకులు, వివిధ మత పెద్దలు, మత గురువులు అందరితో (పీస్) శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మతసామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలవారు పరస్పరం సోదర భావంతో సహకరించుకొని పండుగలను నిర్వహించుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు మతాలకతీతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరి పండుగలను వారు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంతరాలు, అల్లర్లు జరగకుండా కమిటీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది చిరాకు కలిగించే లౌడ్ స్పీకర్లు డీజేలు వంటివి నిషేధించామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు అజ్మీర రాము గంగావత్ లక్ష్మణ్ నాయక్ సక్రు మత పెద్దలు యాకుబ్ జానీ షఫీ అస్మత్ బుడాన్ నరసింహారావు సైజాద్ తదితరులు ఉన్నారు