Saturday, July 27, 2024
HomeతెలంగాణMallapur: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

Mallapur: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి

జిల్లాలో పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, రైతుల సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటానని,
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ ఎలాల. జలపతి రెడ్డి అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. నూతన అధ్యక్షున్ని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి. కృష్ణ రావు, మండల నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జలపతి రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగా రావు, రాష్ట్ర నాయకులు కృష్ణ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -


ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు అవుతుందని, బిఆర్ యస్ వాళ్లకు ప్రభుత్వం కూలిపోవడం మింగుడుపడటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు కూతలు కుస్తున్నారని అన్నారు. జిల్లా, మండల అభివృద్ధి కోసం ఏళ్లవేళలా కృషి చేస్తానని, 1.80 లక్షల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజి లను నిర్మించామని, త్రాగు నీరు కోసం 28 లక్షల రూపాయలు కేటాయించాం. నీటి కొరత తీర్చడం కోసం నిధులు మంజూరయ్యాయని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మండలం లో మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలి… అందరూ కలిసి కట్టుగా పోరాడుతే అనుకున్నది సాధించుకుందాం అని అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను బిఆర్ యస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని, మన ప్రాంతంలో ఉన్న చక్కెర ప్యాక్టరీ ముసివేసిన ఘనత బి ఆర్ యస్ ది. గత ప్రభుత్వం ప్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

కరెంటు పై బి ఆర్ యస్ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని వారు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు.గతం లో వడ్ల పై 10 కిలోలు కట్ చేసినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడ లేదని, మండలంలో పంటలు ఎండిపోలేదని, రైతు క్షేత్రంలోకి వెళ్దాం..పంటలు ఎక్కడ ఎండయో చూద్దామని స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
గతంలో రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు రైతులను తప్పుదోవ పెడుతున్నారు.
ఒక్కటేసారి రుణమాఫీ చేస్తామని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో జీవన్ రెడ్డి నీ అధిక మెజారిటీ తో గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి బ్లాక్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సేవాదళ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, మాజీ సర్పంచ్ నల్ల బాపు రెడ్డి, సీనియర్ నాయకులు కోటగిరి ఆనంద్, మల్లయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News