ప్రస్తుత పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయం అని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో స్థానిక కాగితం వెంకటి నగర్, అక్కి సైద్యులు ప్రాంగణంలో కందునూరి ఈశ్వర లింగం అధ్యక్షతన జరిగిన శాఖ మహాసభలో ఆయన ముఖ్యఅతిదిగా హాజరై మాట్లాడారు. అణగారిన వర్గాల సమస్యలపై పాలక వర్గాలు అనుసరిస్తున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీ సత్తా చాటే విధంగా ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. ముందుగా పార్టీ జెండాను సీనియర్ నాయకురాలు కందునూరి అనంతలక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా పార్టీ జాతీయనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, సీతారాం ఏచూరి, బుద్దాదేవ్ భట్టాచార్యల చిత్ర పటాలకు పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈమహాసభల్లో మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, కవిత, భూక్య హరినాయక్. సత్యవతి, రమా, వీరభద్రం, సుజాత, నాగమణి, అలవాల రామకృష్ణ మౌనిక, శంకర్ నాగరాజు ఎల్లయ్య మహేశ్వరరావు బాజీ తదితరులు ఉన్నారు.


