గార్ల మండల కేంద్రంలోని పలు వీధులలో తిరిగే వీధి కుక్కలకు వింత రోగం సోకింది. వ్యాధి సోకిన కుక్కల చర్మం మొత్తం ఊడిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకటి రెండు కుక్కలకు మాత్రమే ఈ వ్యాధి సోకగా క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. అధికారులు స్పందించి కుక్కలను ఊరి నుంచి తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈవిషయమై మండల పశువైద్యాధికారి సురేష్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఇది ఫంగస్ ద్వారా జంతువులకు సోకుతుందన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల్లో ఎక్కువ వస్తుందని, కేవలం చలికాలంలో మాత్రమే దుమ్ము ద్వారా వస్తుందన్నారు. దీంతో మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇది జంతు సంక్రమిత వ్యాధి మాత్రమే అని తెలిపారు.