Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం

Garla: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం

విద్యుత్ అధికారులు ఎ ఈ మహేంద్ర బాబు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని పీఎసీఎస్ డైరేక్టర్ శీలంశెట్టి ప్రవీన్ కుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా పంట పోలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్థంబాలను తీగలను సరి చేయకుండా అలాగే వదిలేయడంతో కరెంట్ సౌకర్యం లేక రైతులు వ్యవసాయ పంట పొలాలకు నీరు అందక అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో ఉన్న స్తంభాలతో పడరాని పాట్లు పడుతున్నామని ఇంతవరకు విద్యుత్ స్తంభాలను తొలగించ లేదని దేశానికి అన్నం పెట్టే రైతులకు కరెంటు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ రియల్ఎస్టేట్ చేస్తున్న వ్యాపారుల వద్ద డబ్బులు దండుకొని ఖాళీస్థలాల్లో విద్యుత్ స్తంబాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ అధికారులు అవలంబిస్తున్న తీరుతో ప్రజల్లో రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అన్నారు.

- Advertisement -

మండలంలోని చాలా చోట్ల విద్యుత్ వైర్లు మనుషులకు అందేంత ఎత్తులో ఉన్నా కూడా వాటిని పట్టించుకోక పోవడంతో ఇటీవల కాలంలో ఆరు బర్రెలు ఒక యువకుడు మృతి చెందాయని ఆయన వివరించారు. 50 సంవత్సరాలుగా ఏటివద్ద కరెంటు స్తంభాలు ఉన్నాయని ప్రస్తుత ఎ ఈ మహేంద్ర బాబు మాత్రం అలా ఉండడానికి వీలులేదని రైతులను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. విద్యుత్ అధికారుల అవినీతి భాగోతంపై పూర్తి ఆధారాలతో విద్యుత్ శాఖ ఎస్ ఈ సి ఎం డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఈ విషయమై విద్యుత్ ఏఈ మహేంద్రబాబును వివరణ కోరగా పాకాల ఏటి లోపలకు విద్యుత్ స్థంభాలు వేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారని, రోడ్డు నుండి పాకాల ఏటి వరకు సర్వీస్ వైరుఅమర్చుకోవాలని తెలిపారు. వరిపోలాలు ఉన్నందున లోపలకు విద్యత్ పోల్స్ వెయడానికి వీలు కాలేదన్నారు అదేవిధంగా ఈవిషయమై విద్యుత్ ఎస్ ఈ నరేందర్ ను ఫోను ద్వారా వివరణ కోరగా తాను పాకాల ఏటి లోపలకు విద్యుత్ స్థంబాలు వెయవద్దని చెప్పలేదని, ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News