Monday, June 24, 2024
HomeతెలంగాణGarla: పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంప్ పర్యవేక్షణ

Garla: పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంప్ పర్యవేక్షణ

ఇంటర్ కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డా.రాజ్ కుమార్ జాధవ్

గార్ల మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్వాన్స్డ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరిక్షలు జరుగుతున్న నేపథ్యంలో, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ పర్యవేక్షించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతీ పరిక్ష కేంద్రాలలో ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు , మెడికల్ క్యాంపు కి కావలసిన మందులతో పాటు వైద్య పరికరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు . కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ గోవింద రావు ను కలిసి విద్యార్థులకు ఆరోగ్యశాఖ తరుపున ఏటువంటి సహకారం కావాలన్న తెలియజేయాలని కోరారు, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద, లేదా పరిక్ష రాస్తూన్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ శాఖ సిబ్బందికి సంప్రదించి చికిత్స పొందాలనితెలిపారు.
విద్యార్థులందరూపరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావు, లెక్చరర్ అంబెద్కర్ , పోలీసు అదికారులు మంగిలాల్, భారతి , వైద్య సిబ్బంది ఏ ఎన్ ఏం పార్వతి , ఆశా సుజాత తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News