జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుగా బిజెపి మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు జాటోత్ హుస్సేన్ నాయక్ నియామకం కావడం పట్ల బిజెపి గార్ల మండల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందిని గార్డెన్స్ లో హుస్సేన్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సందర్భంగా బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావుక విమల్ కుమార్ జైన్ మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని ఉండి పార్టీ పురోభివృద్ధికి తోడ్పడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ నాయక్ సన్నిహితుడు మహ్మద్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు.