Friday, November 22, 2024
HomeతెలంగాణGarla: దోమల మయం రోగాల భయం

Garla: దోమల మయం రోగాల భయం

రోగాల బారిన ప్రజలు

గార్ల మండల కేంద్రంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అని లేకుండా స్వైర విహారం చేస్తూ.. జలగల్లా పట్టిపీడిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. స్థానిక తాసిల్దార్ బజార్ జెండా బజార్ బెస్త బజార్ రాతి స్తంభం బజార్ ముస్లిం బజార్ లలో కాలువలలో మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. ఎక్కడికి అక్కడే ఆగిపోయి నిల్వ ఉండటంతో దోమలకు ఆవాసాలుగా మారి, దోమ కాటుతో మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చే సూచన ఉన్నా అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనిపించని ఫ్రైడే డ్రైడే కార్యక్రమం గతంలో వర్షాకాలం రాకముందే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీ అధికారులు వైద్య సిబ్బంది ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను, నీటి నిల్వ గుంతలను పరిశీలించి, ఉపయోగంలో లేని వస్తువులలో నీటి నిల్వలను తొలగించి, తేమోపాస్ ద్రావణం పిచికారీ చేయించి పారిశుద్ధ కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫినాయిల్, మలాధీన్లతో స్ప్రే తో పాటుగా ఫాగింగ్ చేయించి పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించేవారు.

- Advertisement -

ఇప్పుడు కనీసం కన్నెత్తి చూడడం లేదు కదా దోమలను నివారించడానికి శానిటేషన్ పనులు చేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు దీంతో దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్ లిక్విడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నెలకు 500 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది

పత్తాలేని ఫాగింగ్
పారిశుధ్యం పై సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారి పలు వ్యాధులు ప్రబలుతుండడంతో పిల్లలు వృద్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతూ విష జ్వరాల బారిన పడుతున్నారు దోమల నివారణకు కచ్చితంగా ప్రతినిత్యం ఫాగింగ్ చేయించాలి ఫాగింగ్ చేయించకపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి ఫాగింగ్ సక్రమంగా చేస్తే దోమలు తగ్గే అవకాశం ఉంది.

వర్షాకాలం వచ్చిందంటే హడల్
వర్షాకాలం వచ్చిందంటే మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరాలతో పాటు సాధారణ జ్వరాలు విజృంభిస్తాయి. ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నా ప్రతి ఏటా వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఇంతవరకు అధికారులు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలాలను దోమలు స్థిర నివాసాలుగా ఏర్పడి దోమల సంతతి వృద్ధి పెరగడంతో రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు డెంగీ మలేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదైతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

నివారణ చర్యలు చేపట్టాలి

లార్వా దశలోనే దశలోనే దోమల నివారణకు చర్యలు చేపట్టి దోమల నివారణ మందులు మురికి గుంతలో పిచికారి చేయాలి. ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు పొగ పెట్టాలి నీటి నిల్వల్లో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు చేపట్టాలి. రాత్రి వేళల్లో కంటికి కునుకులేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమ కుడితే దద్దుర్లు వచ్చి ఒళ్లంతా దురదలు తగ్గడం లేదని వర్షాకాలం కావడంతో ఏ చిన్న జ్వరం వచ్చినా భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News