Sunday, May 12, 2024
HomeతెలంగాణGarla: జైన మందిర పునర్నిర్మాణానికి భూమి పూజ

Garla: జైన మందిర పునర్నిర్మాణానికి భూమి పూజ

ధర్మాన్ని అందరూ కాపాడాలి

గార్ల మండల కేంద్రంలోని స్థానిక మెయిన్ రోడ్ లోని జైన మందిర పునర్నిర్మాణానికి జైన మత గురువు ఆధ్వర్యంలో జైనులు భక్తిశ్రద్ధలతో భూమి పూజ చేశారు. తొలుత జైన మత గురువు ప్రత్యేకమైన ధార్మిక పూజలు చేసి, శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. గార్ల డోర్నకల్ జైన్ సమాజ ప్రముఖులు ఈ భూమి పూజలో పాల్గొని పూజలు చేశారు.

- Advertisement -

అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తి భావనతో నడుచుకోవాలని, భక్తితో ఉంటే మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయని తెలిపారు. నిత్యం భగవంతుడిని స్మరించడంతో ప్రతి ఒక్కరి జీవనం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందన్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గార్ల జైన్ సమాజం ప్రముఖులు గోదా విజయ్ కుమార్ జైన్ రావుక మహా వీర్ ప్రసాద్ జైన్ గోదా మహేందర్ జైన్ గోదా మహావీర్ జైన్ కాలా వినోద్ కుమార్ జైన్ విమల్ కుమార్ జైన్ విపుల్ జైన్ సంజిల్ జైన్ నథిన్ జైన్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News