Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: పెద్దల సమక్షంలో ప్రేమికులకు వివాహం

Garla: పెద్దల సమక్షంలో ప్రేమికులకు వివాహం

కులాంతర వివాహం

గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి ఇరువురు ప్రేమికులకు రెండు కుటుంబాల సమక్షంలో ప్రేమ వివాహాన్ని జరిపించారు. గార్ల మండల కేంద్రంలోని పుట్టకోట బజార్ కు చెందిన గాజుల సందీప్ (32 ) హైదరాబాద్ పట్టణానికి చెందిన కంచేటి అంకిత చౌదరి (30) అనే ఇరువురు యువతీ యువకులు గత మూడు సంవత్సరములుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఇరువురి తల్లిదండ్రుల ఇష్టపూర్తిగా మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గాజుల సందీప్ కంచేటి అంకిత చౌదరి ఇరువురు దండలు మార్చుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఇరువురి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News