Saturday, February 15, 2025
HomeతెలంగాణGarla: కానిస్టేబుల్‌ మంగీలాల్ కు ఉత్కృష్ట సేవా పతకం

Garla: కానిస్టేబుల్‌ మంగీలాల్ కు ఉత్కృష్ట సేవా పతకం

రవీందర్ కు ఉత్తమ సేవా పథకం

విధుల్లో ఉత్తమ సేవలకు గాను గార్ల పిఎస్ కానిస్టేబుల్ మంగీలాల్ కు కేంద్ర హోం శాఖ అతి ఉత్కృష్ట సేవా పథకాన్ని అందజేసింది. అదేవిధంగా గార్ల పిఎస్ లో ఏఎస్ఐగా పని చేస్తున్న రవీందర్ కు ఉత్తమ సేవా పథకం లభించింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఉత్తమ సేవా పథకాన్ని రవీందర్ కు ఉత్కృష్ట సేవా పథకాన్ని మంగీలాల్ కు అందజేశారు. కానిస్టేబుల్ మంగిలాల్ పోలీస్ శాఖలో విధులలో చేరిన 22 ఏళ్ల సర్వీస్ లో ఆయన సేవలకు గుర్తింపు లభించడం, ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కు ఉత్తమ సేవe పథకం లభించడం గర్వకారణమని గార్ల పట్టణ ప్రముఖులు కొనియాడారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఎఎస్ఐ రవీందర్ కానిస్టేబుల్ మంగిలాల్ ను ఎస్పి చెన్నయ్య డిఎస్పి తిరుపతిరావు సీఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News