Friday, April 4, 2025
HomeతెలంగాణGarla: పోలీసుల ముమ్మర తనిఖీలు నగదు స్వాధీనం

Garla: పోలీసుల ముమ్మర తనిఖీలు నగదు స్వాధీనం

ముమ్మరంగా తనిఖీలు

వాహనదారులు ఎన్నికల కోడ్ నిబంధనను పాటించాలని బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గార్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీనత్ కుమార్ లు కోరారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం క్రాస్ రోడ్ లో ముమ్మరంగా తనిఖీలను చేపట్టారు కార్లు ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఇదే క్రమంలో ఓ వాహనంలో ప్రయాణిస్తున్న చెన్ను శివలింగం S/O శంకర్ (32) అనేవ్యక్తి వద్ద 10,1000 రూపాయలు కలిగి ఉండటంతో ఆ వ్యక్తిని విచారించగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ సొమ్మును సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి నిబంధనలను అతిక్రమించి అక్రమంగా నగదును తరలిస్తే సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News