రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు సహకరించాలని మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు కోరారు. గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో గ్రామస్తులతో ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఓట్ల కోసం లంచం ఇవ్వడం, ప్రలోభ పెట్టడం చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గార్ల బయ్యారం సీఐ రవికుమార్ గార్ల ఎస్సై జీనత్ కుమార్ పోలీస్ సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.