Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: సేవాలాల్ ఆన్లైన్ అకాడమీ యాప్ ను సద్వినియోగం చేసుకోండి

Garla: సేవాలాల్ ఆన్లైన్ అకాడమీ యాప్ ను సద్వినియోగం చేసుకోండి

ఎస్సై జీనత్ కుమార్

పేద విద్యార్థులు సేవాలాల్ ఆన్లైన్ అకాడమీ యాప్ ను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్సై జీనత్ కుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ ఆన్లైన్ అకాడమీ యాప్ లోగో వాల్ పోస్టర్ ను ఎస్ ఐ జీనత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సేవాలాల్ ఆన్లైన్ అకాడమీ యాప్ ను గూగుల్ ప్లే లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. యాప్ ను రూపొందించిన వల్లి నాయక్ ను అభినందించారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో గార్ల మండల మాజీ ఎంపీపీ మాలోత్ వెంకట్ లాల్, మర్రిగూడెం మాజీ ఉప సర్పంచ్ మల్లి బాబు, మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ యాకుబ్ పాషా, ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య రామ్ సింగ్ నాయక్, మండల నాయకులు అజ్మీర కిషోర్ నాయక్, మర్రిగూడెం యూత్ గూగులోత్ ప్రశాంత్, భూక్య మధు నాయక్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News