Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: చెట్లు నరకడం కాదు, నాటి చూడండి

Garla: చెట్లు నరకడం కాదు, నాటి చూడండి

చెట్లు నరికినందుకు ఫైన్

ముందు చూపు లేకుండా మొక్కలు నాటడం ఎందుకు పెరిగిన చెట్లు నరకడం ఎందుకని బిజెపి పార్టీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అజ్మీరా సుమలత ప్రశ్నించారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక గ్రోమోర్ పక్కన హోటల్ ఎదురుగా ఉన్న చెట్టును హోటల్ యజమాని అమీనా ఆకులు రాలుతున్నాయని సాకుతో చెట్లను నరికించడం పట్ల ఆమె తీవ్రంగా మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎందరికో నీడనిచ్చి ఎలాంటి స్వార్ధాన్ని ఆశించని చెట్లను తమ ఇష్టానుసారంగా నరికి వేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి పెనుముప్పుగా దారితీస్తుందని చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ లభించకపోవడంతో పాటు కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుందని దీంతో ఎండలు పెరగడంతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. చెట్లను నరికి ప్రగతికి విఘాతం కలిగించే ఇలాంటి వ్యక్తులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు విధించిన 2000 రూపాయలు ఫైన్ ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలని, నిర్మానుషంగా చెట్లను నరికి వేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వారిపై ఫైన్ లతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News