Saturday, July 27, 2024
HomeతెలంగాణKTR tour: ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

KTR tour: ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను కలిసిన కేటీఆర్

నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతు గన్నెబొయిన మల్లయ్యను కలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తమ పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని , మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలన్న మల్లయ్య. మల్లయ్య విడియో చూసి చలించిపోయిన KTR. నల్గొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని ట్విట్టర్ లో పెట్టిన KTR. ఇచ్చిన మాట నిలుపుకుంటు ఇవ్వాళ ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను కలిసిన KTR..

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రామిరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ గారు వందల సార్లు చెప్పారు, ముచంపల్లికి చెందిన రాంరెడ్డి గారి పేరు బోర్ల రామిరెడ్డిగా మారిందన్నారు. గండేపోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రామిరెడ్డి గారి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుందన్నారు. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి వచ్చానన్నారు.

రామ్ రెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పిర్రని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినయ్, తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దినావస్థను చెప్పుకుంటున్నారన్నారు కేటీఆర్.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారని, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విపల ప్రాజెక్టుగా చూపించాలని… రిజర్వాయర్లలో నీళ్ళు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడిందన్నారు. కానీ కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్ కి నీళ్లు వదిలినారని, నిన్నటి దాకా కాలేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్ కి నీళ్లు అందిస్తున్నారన్నారు.

కెసిఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని… Tailend దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందిందన్నారు. గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక బోరు వెయ్యాల్సిన పరిస్థితి రాలేదని, కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారన్నారు. ఇది ఈరోజు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందన్నారు కేటీఆర్.

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల కలిగినది ఈ దుస్థితి అంటూ కేటీఆర్..వంద పది రోజులు అయినా కూడా… నీళ్లు అందించలేని అసమర్థ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయాలన్న దుర్మార్గ పూరిత, చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ఎండబెట్టిందన్నారు. ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి 25వేల రూపాయలు పంట నష్టం అందించాలన్నారు. ఇది మీరు తెచ్చిన కరువు… మీరు తెచ్చిన దుస్థితి.. కాబట్టి మీరు పరిహారం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News