Saturday, May 25, 2024
HomeతెలంగాణGarla: వేడుకగా వడ్లమూడి దుర్గాప్రసాద్ జన్మదినం

Garla: వేడుకగా వడ్లమూడి దుర్గాప్రసాద్ జన్మదినం

అభిమానుల గుండెల్లో ఆయనకు సుస్థిర స్థానం

జననేత పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని చాటుతూ దుర్గాప్రసాద్ అభిమాన సంఘం నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననేత, బడుగు బలహీన వర్గాల బాంధవుడు తమ అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు శీలం శెట్టి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ యువ నాయకులు లెనిన్ మోహిన్ శ్రీను రమేష్ అఫ్జల్ సాయి పాషా రాజశేఖర్ కిషన్ వెంకటేష్ వీరస్వామి ఐలయ్య పురుషోత్తం నాగరాజు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News