Thursday, April 3, 2025
HomeతెలంగాణGodavarikhani: మీర్జంపేట వాసికి డాక్టరేట్ అవార్డు

Godavarikhani: మీర్జంపేట వాసికి డాక్టరేట్ అవార్డు

అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ..

పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన ఉయ్యాల బాలకృష్ణ అన్నామలై గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయటం విశేషం. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యాసంస్థలు ఫార్మసీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. పరిశోధక విద్యార్థిగా ఫైటో కెమికల్స్ పైన పరిశోధన, ఎంపిక చేయబడిన ఔషధ మొక్కల నుండి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శక్తి నిర్ధారణ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను అన్నామలై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ, ఎండి హెచ్.ఎస్ షైనీ ముఖ్యఅతిథి ప్రొఫెసర్ అనిల్ డి సహస్ర బుద్ధి, డైరెక్టర్ కె వెంకటరావు జాయింట్ డైరెక్టర్ పి. పార్థసారథి, ప్రిన్సిపాల్ షేక్ హసన్ రషీద్ లు బాలకృష్ణను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News