Hyderabad Metro 2nd phase| హైదరాబాద్ మెట్రో రెండో దశ(Hyderabad Metro 2nd phase) పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు జీవీ 196 జారీ అయింది. దీంతో మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభంకానున్నాయి. ఈ ఐదు మార్గాల్లో 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లు నిర్మించనున్నారు. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్ల వరకు మార్గం ఉంటుంది.
రెండో దశ మెట్రో నిర్మాణానికి మొత్తం రూ.24,269 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4.230కోట్లు ఉండనుంది. ఇక 11,693 కోట్లు (48%) అప్పు, 1,033 కోట్లు(4%) ప్రైవేట్ సంస్థలు అందించనున్నాయి. మెట్రో రైలు రెండో దశను నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
రెండో దశ పార్ట్ Aలో కారిడార్లు..
కారిడార్ 4 – నాగోలు TO శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8కి.మీ)
కారిడార్ 5 – రాయదుర్గం TO కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ)
కారిడార్ 6 – ఎంజీబీఎస్ TO చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
కారిడార్ 7 – మియాపూర్ TO పటాన్‌చెరు (13.4 కి.మీ)
కారిడార్ 8 – ఎల్బీనగర్ TO హయత్ నగర్ (7.1 కి.మీ)
పార్ట్ B కారిడార్..
కారిడార్ 9 – శంషాబాద్ TO ఫ్యూచర్ సిటీ (40 కి.మీ)