Sunday, November 16, 2025
HomeNewsIndiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. న్యాక్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని సూచించారు. అలాంటి ఇళ్లకే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) నిర్మాణం చేపట్టామన్నారు.

- Advertisement -

అయితే కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టామన్నారు. ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ మినహాయింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు అని పొంగులేటి హెచ్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad