Sunday, November 16, 2025
HomeతెలంగాణGudem Mahipal: వాణి నగర్ లో బస్తీ దవఖాన ప్రారంభం

Gudem Mahipal: వాణి నగర్ లో బస్తీ దవఖాన ప్రారంభం

మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాణి నగర్ లో ఏర్పాటు చేసిన నూతన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం ఎల్ ఏ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సహాయ సహకారాలతో మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

- Advertisement -

కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు మంచినీళ్ల కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితుల నుండి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకోవడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకతతో పనులు నిర్వహించడంతోపాటు పరిపాలనలో నూతన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రతి ఒక్కరిలో జవాబుదారితనం పెంపొందించామన్డంనారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ కృష్ణ,కల్పన ఉపేందర్ రెడ్డి,బోయిని బాలమణి బాలరాజు,బిజిలి రాజు,కొల్లూరు గోపాల్, నవనీత జగదీష్,మంజుల ప్రమోద్ రెడ్డి,కోఆప్షన్ సభ్యులు,తల్లారి రాములు, యూనుస్,మున్సిపల్ కమిషనర్ సుజాత, బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చౌటకూరి బాల్రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తోటకూరి మైపాల్ రెడ్డి, ఆంజనేయులు, సురేందర్ రెడ్డి, కొల్లూరు యాదగిరి, దాస్ యాదవ్, శేఖర్, లింగం గౌడ్, నీలం బిక్షపతి ముదిరాజ్, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad