Saturday, June 21, 2025
HomeతెలంగాణGudem Mahipal Reddy: జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు

Gudem Mahipal Reddy: జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు

గుమ్మడిదల, అనంతారం గ్రామాలలో ఘనంగా గ్రామ జాతరలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ కామరతి బీరప్ప జాతర, గుమ్మడిదలలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఆయా గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News