Saturday, November 23, 2024
HomeతెలంగాణGuvvala Balaraju: గొర్రెల పంపిణీతో యాదవులకు ప్రత్యేక లబ్ది

Guvvala Balaraju: గొర్రెల పంపిణీతో యాదవులకు ప్రత్యేక లబ్ది

వంగురోని పల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీతో యాదవులకు ప్రత్యేక లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని వంగురోని పల్లి గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల ఉత్పత్తిలో రాజస్తాన్‌ రాష్ట్రాన్ని అధిగమించి తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుందని, రెండువిడతలలో కలుపుకుని తెలంగాణలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీనీ అందిస్తుందని పేర్కొన్నారు. గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థనుబలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. వంగురోని పల్లి గ్రామంలో రెండవ విడతలో 21 యూనిట్స్ పంపిణి చేశామని, ఒక యూనిట్ కోసం 1.75 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు చెన్నకేశవులు, యాదవ సంఘం అధ్యక్షుడు సుల్తాన్, నాయకులు పంబలి మల్లేష్, రంజాన్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News