హైదరాబాద్ లోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యలను క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి తలసాని ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకొని అనేకమంది పేదలు నివసిస్తున్నారని, వారికి యాజమాన్యపు హక్కులు కల్పించాలని కోరుతూ వస్తున్నారని తలసాని చెప్పారు. దీంతోపాటు కవాడి గూడలోని సోమప్ప మఠం స్థలంలో సుమారు 100 నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయని ఈ స్థలాన్ని జిహెచ్ఎంసికి బదలాయింపు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఈ ప్రాంతంలోని పేదల ప్రజలు ఎంతో కాలం నుండి కోరుతూ వస్తున్నారన్నారు. ఈమేరకు వచ్చే సోమవారం జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముందు వివరాలను సమర్పిస్తామన్నారు.