ఎస్ఓసీనెట్ సౌత్ ఏసియా నేషనల్ సెక్యురిటీ డైరెక్టర్ రిచర్డ్ లన్ పుగ్ కుక్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ హైదరాబాద్ ఏపీ, తెలంగాణ రాజకీయ ఆర్థిక సలహాదారుల నళిని రఘురాం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూం పనితీరును, వ్యవస్థల ఏర్పాట్లను గురించి వివరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెక్యూరిటీ, ఐటీ సేవలను గురించి కొనియాడారు. వివిధ వర్గాలతో కలిసి సిటీ పోలీసులు అందిస్తున్న సేవలు బేష్షుగా ఉన్నాయని అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్ సిటీ పోలీసులు కష్టపడుతున్న తీరు ఎనలేనిదని అన్నారు. వారికి సీపీ ఆనంద్ ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్జాతీయ భాగస్వాములతో భద్రతాపరమైన విషయాల్లో పనిచేస్తూ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.