Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: గాంధీకి ఘన నివాళి

Hyd: గాంధీకి ఘన నివాళి

మహాత్ముడు చూపిన బాటలో కేసీఆర్

జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ బోగరపు దయానంద్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, బి .ఆర్. ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు మాహాత్మా గాంధీ గారని తెలిపారు. సత్యం, అహింస మార్గంలో దేశాన్ని నడిపించి స్వాతంత్య్రన్ని సాధించిన గొప్ప నేత అని అన్నారు. మహాత్ముడు చూపిన దారిలో నడుస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ నేటి యువత తమ లక్ష్యాన్ని సాధించుకోవాలని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News