Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: కొండా లక్ష్మణ్ బాపూకి ఘన నివాళి

Hyd: కొండా లక్ష్మణ్ బాపూకి ఘన నివాళి

రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా బాపూజి జయంతి

స్వాతంత్ర సమరయోధుడు, తొలి తరం తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి రాష్ట్రం ఘన నివాళి అర్పించింది. ట్యాంక్ బండ్ పై స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ L రమణ, బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణ మోహన్ రావు ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ స్మరించుకున్నారు. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమము లో చురుకుగా పాల్గొన్నా నాయకులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. నికార్సైన తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ అని వారి ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమం కోసం తన పదవి ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శివశంకర్, పద్మశాలి జాతీయ యువజన సంఘం ఇన్చార్జి అవ్వారి భాస్కర్ నేత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News