Friday, April 4, 2025
HomeతెలంగాణHyd: 'శిశువిహార్'లో మంత్రి మనవరాలు పుట్టినరోజు

Hyd: ‘శిశువిహార్’లో మంత్రి మనవరాలు పుట్టినరోజు

స్టేట్ హోమ్ లోని శిశువిహార్ లో రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మనవరాలు ఆద్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. చిన్నారి ఆద్య అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసారు. అక్కడి చిన్నారులు ఆద్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. పియానో వాయించి బర్త్ డే విషెస్ చెప్పిన చిన్నారుల ప్రతిభను మంత్రి అభినందించారు. చిన్నారులతో కలిసి కొంత సమయం గడిపిన మంత్రి సత్యవతి రాథోడ్ అనంతరం చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి నెల పైన కూర్చుని మంత్రి భోజనం చేశారు. పలువురు చిన్నారులకు మంత్రి గోరుముద్దలు తినిపించారు. అనంతరం శిశువిహార్ ను సందర్శించిన మంత్రి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News