రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.
చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల…అనంతరం నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాల రాజు, పలువురు ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.