Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: రాముడి పేరుతో రాజకీయమా? రామరాజ్యమా? ఏది కావాలి?

Hyd: రాముడి పేరుతో రాజకీయమా? రామరాజ్యమా? ఏది కావాలి?

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా కంటోన్మెంట్ అసెంబ్లీ వార్డ్ -1 ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సభ అధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి , కంటోన్మెంట్ నూతన ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ చెర్మన్ మన్నే క్రిశాంక్, గజ్జల నగేష్, శ్రీనివాస్, మధుకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నడిచేక్రమంలో చాలామంది టిఆర్ఎస్ కండువా కప్పుకున్న వారిని హేళన చేశారు. తెలంగాణ వస్తదా ..చస్తదా..కేసీఆర్ తెస్తాడు.. అని చాలామంది అవహేళన చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ వెంట కంటోన్మెంట్ నుండి రఘు గుప్తా గారు , మురళి కృష్ణ, నీల భాస్కర్ , నరసింహ రావు , పి శ్రీనివాస్ , అరుణ్ యాదవ్ , బి శ్రీనివాస్ ఇలా చాలాతక్కువ మంది కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ వస్తదని అర్థమైన తర్వాత తెలంగాణ వస్తే పరిశ్రమలు పోతాయి..పెట్టుబడులు రావు..కరెంట్ ఉండదు ..పరిపాలన చేతకాదు..అభివృద్ధి ఉండదు..తెలంగాణ ప్రజలు వలస వెళ్లి పోవాల్సిందే అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేసారు.

కానీ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ను ఎంతగా అభివృద్ధి చేసారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్..ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పధకాలు , అభివృద్ధి కార్యక్రమాలు , 200 ఉన్న పెన్షన్ ను 2000 రూపాయలకు పెంచిన మహానాయకుడు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ గారు తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసారు. ఎంతో బాధ్యతగా పాలనా అందిస్తూ..సంపద సృష్టించిండు..సష్టించిన సంపద ను ప్రజలకు అందిస్తున్న మహానాయకుడు మన కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని దాసోజు శ్రవణ్‌ అన్నారు.

కేసీఆర్ గారిది పెద్ద చెయ్యి..అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన గ్రాండే..సెక్రటేరియట్ కట్టిన గ్రాండే , ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కట్టిన గ్రాండే, ఇంటిఇంటికి మంచి నీళ్లు అందించే మిషన్ భగీరథ ఇలా అనేక పథకాలు పెద్ద మనసుతో పెద్ద చెయ్యి తో అమలు చేసిన నాయకుడు కాబట్టే ఈరోజు కేసీఆర్ గారిని అన్ని రాష్ట్రాల వారు కోరుకుంటున్నారు.

కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ , షాదీ ముబారక్, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన లు ఇలా ఎన్నో తీసుకొచ్చిన కేసీఆర్ పై , ఆయన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తూ.. ఈడీ, సిబిఐ కేసులు పెడుతున్నారు. అంతే కాదు బిఆర్ఎస్ నాయకులపై బిజెపి నాయకులు దాడులు చేస్తున్నారు. ఈ దాడిని తిప్పి కొట్టే బాధ్యత మనపై ఉంది. కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాలు మాకు మీరు కావాలంటూ కోరుకుంటున్నారు. మహారాష్ట్ర , కర్ణాటక , ఒరిస్సా , ఆంధ్రప్రదేశ్ ఇలా యావత్ రాష్ట్రాలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు.

ప్రశ్నించే గొంతుక..ప్రశ్నించే గొంతుక అంటే ప్రజలు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిచారు. కానీ ఆయన ప్రజల కష్టాల గురించి ప్రశ్నించడం లేదు.. కమిషన్ల కోసం ప్రశ్నిస్తున్నాడు అంటూ రేవంత్ పై శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పొద్దున్న ప్రెస్ మీట్ పెడతాడు..మధ్యాహ్నం RTI అప్లికేషన్ పెడతాడు ..సాయంత్రానికి సెటిల్ మెంట్ చేసుకుంటాడు. ప్రభుత్వాలని నిలిదీసేందుకో ..బిజెపి ని నిలిదీసేందుకో ప్రెస్ మీట్ పెట్టడు. కాంట్రాక్టర్ల గురించి …రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారి గురించి..కంపెనీ లు నడిపే వ్యాపారవేత్తల గురించి ప్రెస్ మీట్ లు పెడుతాడంటూ రేవంత్ పై శ్రవణ్ ఫైర్ అయ్యారు.

రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే బిజెపి కావాలా..? రామరాజ్యం కొనసాగిస్తూ..రాముడి రాజ్యంలో ఎలాగైతే ప్రజలు సుఖంగా ఉన్నారో ..అంటువంటి సుఖమైనా పరిపాలన అందిస్తున్న బిఆర్ఎస్ కావాలా..? అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈరోజు బీజీపీ నాయకులూ పేపర్ లీకేజ్ చేసి కేసీఆర్ ను బదనాం చేస్తున్నారు..మత విభేదాలు సృష్టించి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మతాల వారిని ప్రేమగా చూస్తూ..అన్ని వర్గాల వారు ఒక్కటే అని అందర్నీ సమానంగా చూస్తున్న కేసీఆర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటూ మంత్రులు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News