Wednesday, March 26, 2025
HomeతెలంగాణMLC Elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

MLC Elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు(MLC Elections) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఏప్రిల్‌ 23న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది. మే1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఇటీవల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News