Saturday, July 27, 2024
HomeతెలంగాణDharmapuri: కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు వెల్లువెత్తిన జనాభిమానం

Dharmapuri: కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు వెల్లువెత్తిన జనాభిమానం

ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల నామినేషన్

ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. ధర్మపురిలో జనసంద్రం పోతేత్తింది. బీఆర్ ఎస్ అభ్యర్థిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, నియోజకవర్గం కు చెందిన జీడ్పిటీసి సభ్యులు బాధినేని రాజేందర్, పుస్కూరి పద్మజ, మండల పరిషత్ సభ్యులు ముత్యాల కరుణశ్రీ, ,బలరాం రెడ్డి, డిసి ఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు,మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నేతలు నామినేషన్ సందర్బంగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు.నామినేషన్ కు వెల్లువెత్తిన జనాభిమానం వెల్లు వేత్తింది.అడుగడుగునా డప్పుచప్పుళ్లు, కోలాటాలు, తప్పెట్లు, బతుకమ్మలు కోలాటలతో మహిళలు ముందు నడిచారు.

- Advertisement -

ధర్మపురి వీధులన్నీ గులాబీ మాయం అయ్యాయి. రోడ్లకు ఇరువైపులా నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలతో సందడిగా మారింది. అంతకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధితో పాటు..రామగుండంలోని విజయ దుర్గ దేవి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నామినేషన్ పత్రాలు (బి ఫామ్) స్వామి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కొప్పుల ఈశ్వర్ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రార్ధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News