Sunday, November 16, 2025
HomeతెలంగాణGarla: ప్రజల వద్దకే ప్రజా పాలన

Garla: ప్రజల వద్దకే ప్రజా పాలన

5 గ్యారెంటీల కోసం అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి ఎంపీటీసీ మాలోత్ వెంకట్ లాల్ అన్నారు గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం పెనిరెడ్డి గూడెం గోపాలపురం చిన్నబంజర గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి ఎంపీటీసీ వెంకట్ లాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రజాపాలన కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అభయస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేశారని, వాటిని అమలులోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఐదు పథకాల పేరిట లబ్ధిదారుల కోసం ఒకే దరఖాస్తును తీసుకువవచ్చిందన్నారు.

- Advertisement -

మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటి యజమాని పేరు, సామాజిక వర్గం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాలన్నిటిని దరఖాస్తులో పూరించాలన్నారు. అభయ హస్తం గ్యారంటీ పథకాల్లో దేని కోసం దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని, దరఖాస్తులను స్వీకరించాక అధికారులు దరఖాస్తులు ముట్టినట్టుగా ఇచ్చే రసీదులను తీసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్, ఎంపీడీవో రవీందర్, తాసిల్దార్ స్వాతి బిందు, సర్పంచ్ బాదావత్ రాందాస్, ఉప సర్పంచ్ లలిత, కార్యదర్శి కిషన్, ఎస్సై జీనత్ కుమార్, కౌంటర్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad