Saturday, November 23, 2024
HomeతెలంగాణTandur: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఎక్సెజ్ శాఖ విస్తృత తనిఖీలు

Tandur: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఎక్సెజ్ శాఖ విస్తృత తనిఖీలు

8712658754 నెంబర్ కాల్ చేస్తే చాలు..

గణతంత్ర దినోత్సవం రోజున బెల్టు దుకాణాల్లో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం అక్రమార్కులను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని జనవరి 26వ తేదీన తెలుగు ప్రభ దినపత్రికలో ” గణతంత్ర దినోత్సవం రోజున జోరుగా మద్యం అమ్మకాలు” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి తాండూరు ఎక్సెజ్ శాఖ అధికారులు స్పందించారు. తాండూరు ఎక్సెజ్ శాఖ సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ యాలాల్ మండల పరిధిలోని కొకట్ రోడ్డులో గల బెల్టు దుకాణాలను తనిఖీలు చేశారు. అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాండూరు పట్టణంలో పాన్ షాప్, హెయిర్ సెలూన్స్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా అనంతయ్య మాట్లాడుతూ… గణతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు అని దినపత్రికలో వచ్చిన కథనంతో తాండూరులో విస్తృత తనిఖీలు చేశామన్నారు. పట్టణ, పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల, గంజాయి, గంజాయి చాక్లెట్ల విక్రయాలు కొనసాగిస్తున్నట్లు అనుమానాలపై విస్తృత తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. తాండూరులో గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిసిన 8712658754 నెంబర్ కి  సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News