Friday, November 22, 2024
HomeతెలంగాణSharmila Arrest: బీజేపీని సైడ్ చేసేందుకే షర్మిల అరెస్టా?

Sharmila Arrest: బీజేపీని సైడ్ చేసేందుకే షర్మిల అరెస్టా?

- Advertisement -

Sharmila Arrest: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. షర్మిల అరెస్ట్, జడ్జి ముందు హాజరు, రిమాండ్ విధించడం.. చివరికి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు.. మొత్తం ఎపిసోడ్ హైడ్రామాగా నడిచి పొలిటికల్ హీట్ పెంచింది. అసలేంజరిగిందంటే.. మంగళవారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడి పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు. సోమవారం నర్సంపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును స్వయంగా నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్ వైపు వచ్చారు.

దీంతో, పోలీసులు ఆమెను పంజాగుట్ట సర్కిల్ వద్ద అడ్డుకుని.. వాహనంలో నుంచి దిగాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించి డోర్ లాక్ చేసుకొని కారులోనే ఉండిపోయారు. వైఎస్సార్‌టీపీ ఆందోళనతో పంజాగుట్ట మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో షర్మిల కారును పోలీసులు క్రేన్ సాయంతో లాక్కెళ్లారు. ఆ సమయంలో షర్మిల కూడా వాహనంలోనే ఉన్నారు. పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, మైత్రివనం మీదుగా ఆమె వాహనాన్ని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం షర్మిలను అదుపులోకి తీసుకొని ఎస్సార్‌నగర్ పీఎస్‌లోకి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఫైనల్ గా నాంపల్లి కోర్టులో షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది. ఇక, ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరాహార దీక్షకు దిగారు. షర్మిలను అరెస్టు చేసిన విషయం ఆమె భర్త అనిల్ కుమార్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, మీడియాలో ఆయనెక్కడా కనిపించలేదు.

అయితే, షర్మిల నిరసన, అరెస్ట్ వ్యవహారం మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రసారం చేయగా.. రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని కొందరంటుంటే.. ఇది పక్కా టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అని.. బీజేపీని సైడ్ చేసేందుకు షర్మిలను ప్రయోగిస్తున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు. నిజానికి భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర, బీజేపీ బహిరంగ సభ జరిగింది. అయితే షర్మిల అరెస్ట్ తో ఉదయం నుండి మీడియా ఇదే వార్తను కవరేజ్ చేయడంతో బీజేపీ సభ మరుగున పడింది. ఇదే కేసీఆర్ ప్లాన్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా షర్మిల బీజేపీ వదిలిన బాణం అని కొందరు.. టీఆర్ఎస్ ప్లాన్ అని మరికొందరు కామెంట్లతో పెద్ద వార్ నడుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News