Friday, April 4, 2025
HomeతెలంగాణJadcharla: ఒక్క డీఎస్సీలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

Jadcharla: ఒక్క డీఎస్సీలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

పేదరికం అడ్డు కాదని..

ఒకే డీఎస్సీలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది మనిషా. జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ పట్టుదలతో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి గెలుపుకు పేదరికం అడ్డు కాదని మనీషా నిరూపించింది. ఆరు నెలల క్రితం పరీక్షల సమయంలో తండ్రిని కోల్పోయిన మనీషా ఒక్క వైపు కుటుంబానికి అండగా ఉన్న తండ్రిని దూరమైన బాధ, మరోవైపు తండ్రి కలను సహకారం చేయాలనే పట్టుదలతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ తల్లి విజయమ్మ సహకారంతో మొదటి ప్రయత్నంలోనే రెండు టీచర్ ఉద్యోగాలను సాధించి శభాష్ అనిపించుకుంది.

- Advertisement -

తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే పట్టుదలతో ఉద్యోగం సాధించానని మనీషా తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ లో ఉద్యోగ సాధించిన మనీషాకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News