Saturday, November 15, 2025
HomeతెలంగాణJammikunta: అమ్మమ్మ మీద మమకారంతో పాడె మోసిన మనుమరాళ్లు

Jammikunta: అమ్మమ్మ మీద మమకారంతో పాడె మోసిన మనుమరాళ్లు

పెంచి పెద్ద చేసినందుకు ప్రేమతో..

చిన్నతనంలో పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ పై తమకున్న మమకారాన్ని చాటుకునేందుకు ఆ మనమరాళ్లు సిద్ధమయ్యారు. అమ్మమ్మ మృతిచెందగా ఆమె పాడెను మోసి, ఆమెపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీకి చెందిన చల్ల ఓదెమ్మ (82) మృతిచెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆమె కూతుళ్ళ కుమార్తెలైన నలుగురు అక్కా చెల్లెలు తమ అమ్మమ్మ పాడెను మోస్తామని ముందుకు వచ్చి అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోశారు. ఆడకూతురులైనప్పటికీ మగవారితో సమానంగా అంతిమయాత్రలో పాల్గొ,ని పాడెను మోసి తమ అమ్మమ్మపై తమకున్న మమకారాన్ని చాటి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad