Friday, April 4, 2025
HomeతెలంగాణKale Yadayya: సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన MLA

Kale Yadayya: సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన MLA

అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే బిజీ

శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ హెచ్ఎండిఏ నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో సి సి రోడ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ఎన్నికలలో బిఆర్ఎస్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శాంత చెన్నయ్య, గ్రామ ఉపసర్పంచ్ పద్మ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణువర్ధన్, రాజు గౌడ్, ప్రకాష్ గౌడ్, సూర్య కళ, సుక్కయ్య , వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News