Sunday, November 16, 2025
HomeతెలంగాణKalvakuntla Vidya Sagar Rao: కోటి వృక్షార్చనలో విద్యాసాగర్ రావు

Kalvakuntla Vidya Sagar Rao: కోటి వృక్షార్చనలో విద్యాసాగర్ రావు

హరితహార తెలంగాణగా మారుద్దాం

మెట్టుపల్లి మెట్టుపల్లి మున్సిపల్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణ 12.వార్డు లోని అర్బన్ కాలనీలో కోటి వృక్షర్చన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్యనారాయణ మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమం మున్సిపల్ అర్బన్ లో ప్రారంభించామన్నారు. అత్యధికంగా పండ్ల మొక్కలు నాటినట్టు, పండ్ల చెట్లు విరివిరిగా పెంచి, పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా మొక్కలు పెంచుతామన్నారు. తెలంగాణ హరితహార తెలంగాణగా పేరు రావాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని దశాబ్దం నుండి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానవేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ కౌన్సిలర్స్ ఆర్పీలు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad