Monday, November 25, 2024
HomeతెలంగాణKamareddy: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ..

Kamareddy: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ..

వినతి..

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం మోతే గ్రామంలో భూమిని సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తెలిపారు.

- Advertisement -

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గ వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు తోడ్పాటు ను అందించాలని డిప్యూటీ సీఎంను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News