Friday, September 20, 2024
Homeతెలంగాణరిసోర్స్ పర్సన్స్ వల్లే కంటి వెలుగు సక్సెస్

రిసోర్స్ పర్సన్స్ వల్లే కంటి వెలుగు సక్సెస్

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతంలో రిసోర్స్ పర్సన్స్ ల పాత్ర కీలకమని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళ రిసోర్స్ పర్సన్స్, వివోలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేసిన మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సోదరుడిగా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు221మందికి ఇందులో 169 మంది మహిళా రిసోర్స్ పర్సన్స్,52 వివో లకు చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయవంతంలో రిసోర్స్ పర్సన్స్ ల పాత్ర కీలకమని అన్నారు. మహిళలు లేని దినోత్సవమే లేదని ప్రతిరోజు మహిళా దినోత్సవమే అన్నారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రిసోర్స్ పర్సన్స్ కు 200/- గౌరవ వేతనం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలుగు వేలకు పెంచడం జరిగిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు జరుగుతుందన్నారు. రిసోర్స్ పర్సన్స్ ల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో నిలిచిందని, వారి పాలనలో గుంతల రోడ్లు ఉండేవని, తలపున మానేరు జలాశయం ఉన్న తాగునీటి కోసం నీటి ట్యాంకుల వద్ద బిందెలతో నిలబడ్డారని, కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక స్వయం పాలనలో ఈ కష్టాలన్నింటికీ కెసిఆర్ చెక్ పెట్టారని, నగరంలో కోట్లాది రూపాయల వెచ్చించి సుందరమైన రోడ్లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్లో ప్రతి నిత్యం నేటి సరఫరా చేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చేశామన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్ ఎలా ఉంది 8 సంవత్సరాల స్వయం పాలనలో కరీంనగర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని మంత్రి తెలిపారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కెసిఆర్ ప్రభుత్వం రావాలన్నారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ కు చీరలను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, ఎంపీపీ టి.లక్ష్మయ్య, కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పిటిసి పిట్టల కరుణ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News