నిజాలను నిక్కచ్చిగా ప్రజల ముందు ఉంచడంలో తెలుగు ప్రభ దిన పత్రిక ముందు వరుసలో ఉంటుందని తెలుగు ప్రభ దినపత్రిక సీఈవో రమేష్, తెలంగాణ నెట్వర్క్ ఇంచార్జ్ గౌతం అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్ లో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగు ప్రభ కుటుంబ సభ్యుల సమావేశాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్చార్జ్ గోల్లే రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు ప్రభ దినపత్రిక సీఈవో రమేష్, తెలంగాణ నెట్వర్క్ ఇంచార్జ్ గౌతం మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు పనిచేస్తుంటాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడంలో తెలుగు ప్రభ దినపత్రిక ముందుంటుందన్నారు ప్రధాన పత్రికలకు దీటుగా తెలుగు ప్రభ దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల మన్నలను పొందడం జరిగిందన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వ్యయప్రయాసాల కోర్చి ప్రధాన పత్రికలకు పోటీగా తెలుగు ప్రభ దిన పత్రికను ప్రజల ముందుకు తీసుకు వస్తున్న తెలుగు ప్రభ దినపత్రిక చైర్మన్ చంద్రశేఖర శర్మకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని తెలుగు ప్రభ కుటుంబ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ పత్రికకు మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి రామస్వామి మాట్లాడుతూ… తెలుగు ప్రభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కుటుంబ సభ్యులందరి సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు.
✳️ తెలుగు ప్రభ కుటుంబ సభ్యుల ముందస్తు హోలీ వేడుకలు…
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి తెలుగు ప్రభ కుటుంబ సభ్యుల సమావేశం అనంతరం తెలుగు ప్రభ కుటుంబ సభ్యులందరూ ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు కుంకుమ తిలకం దిద్దుకుని ఆనందంగా హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బ్యూరో రాజు, జగిత్యాల జిల్లా బ్యూరో మదన్మోహన్, హుజురాబాద్ ఆర్ సి ఇంచార్జ్ కొండపాక అశోక్, కరీంనగర్ ఆర్ సి ఇంచార్జ్ సత్తయ్య, చొప్పదండి ఆర్సి ఇంచార్జ్ స్కైలాబ్, మానకొండూరు ఆర్సి ఇంచార్జ్ సదానందం, తెలుగు ప్రభ దినపత్రిక మండల రిపోర్టర్లు మూల తిరుపతి, రవీందర్, ప్రవీణ్, హరి, శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.