మహబూబాబాద్ దంతలపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమంకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ హాజరై ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమనికి తొర్రూర్ సబ్ డివిజన్ కి సంబంధించిన తొర్రూర్,పెద్ద వంగర, నెల్లికుదురు, నరసింహుల పేట, దంతాలపల్లి, మరిపెడ సిరోల్, చిన్న గూడూర్ పోలీస్ స్టేషన్ ల పరిధి నుండి ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులు తెలిపేందుకు అవకాశం కల్పించినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు, ఎస్సైలకు సూచించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలసిందిగా పిర్యాదుదారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని ఎస్పీ అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించినందుకు పోలీస్ అధికారులు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని అధికారులకు సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటు ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.