Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

Karimnagar: ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

మారుతున్న కాలానికనుగుణంగా సేవల్లోనూ వినూత్నఒరవడితో ముందుకు సాగండి

సమస్యల తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఫిర్యాదులను సత్వరం పరిష్కారం అయ్యేలా పోలీస్ స్టేషన్లకు చెందిన పరిపాలన అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ పనివిభాగాల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి ఏసిపి పి కాశయ్య, ఆ విభాగం ఇంఛార్జి, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి పనివిభాగం అధికారి పోలీస్ స్టేషన్లకు వచ్చే అన్నివర్గాలకు చెందిన ప్రజలకు కనీస మర్యాదనిచ్చి సత్ప్రవర్తనతో మెదలాలని చెప్పారు.

- Advertisement -

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పరిపాలన అధికారులుగా (ఏఓ) పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి పి కాశయ్య, ఆ విభాగం ఇంఛార్జి, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు చెందిన పరిపాలన అధికారులు ఎస్ హెచ్ ఓ లతో సమానమైన విధినిర్వహణ భాద్యతలను నిర్వర్తించాలని, ఎస్ హెచ్ ఓ లు అందుబాటులో లేకున్నా దృష్టికి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తూ వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లలోని అన్ని విభాగాల పనితీరుపై అవగాహన కలిగిఉండాలని చెప్పారు. వేగవంతంగా పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా సేవల్లోనూ వినూత్న ఒరవడితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. వివిధ విభాగాల పనితీరులో లోపాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్ళాలని సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపని విభాగం అధికారి భాద్యతాయుతంగా సేవలందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. ప్రతిపని విభాగం పనితీరులో ముందజలో ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు రేయింబవళ్ళు సేవలందించేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 5ఎస్ కార్యక్రమం అమలుతీరును ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. స్టేషన్ల ఆవరణను అహ్లాదకరంగా రూపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు పోలీస్ వచ్చే ప్రజలకు సుహృద్భావమైన వాతావరణం కల్పించడం ద్వారా వారు తమవిన్నపాలను నిర్భయంగా తెలియజేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News